”>
<\div>

Tuesday, 18 August 2015

భారత రాజ్యాంగం - ప్రాధమిక విధులు సమాచరం


  • రాజ్యాంగం అమలులోనికి వచ్చిన 26 సం,రాల తర్వాత 1976 లో 42 రాజ్యాంగ సవరణ ద్వార 51(A) లో పోందుపర్చారు.
  • వీటిని స్వరణ్ సింగ్ కమిటీ సిఫారస్ మేరకు రష్యా రాజ్యాంగం నుండి గ్రహించారు.
భారతదేశంలో ప్రతి పౌరునికి గల ప్రాధమిక విధులు :
  1. భారత రాజ్యాంగాన్ని గౌరవించవలెను. రాజ్యాంగపు ఆదర్శాలను, సభలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించవలెను.
  2. భారత స్వతంత్ర సంగ్రామంలో, ప్రోత్సహింపబడ్డ ఆదర్శాలను గౌరవించాలి.
  3. భారతదేశపు సార్వభౌమత్వాన్ని, అఖండత్వాన్ని, ఏకత్వాన్ని గౌరవించి, పెంపొందింపవలెను.
  4. అవసరం లేదా అవకాశం గలిగితే భారతదేశానికి సేవచేయుటకు ఎల్లవేళలా సిద్ధంగా వుండవలెను.
  5. భారతదేశంలో, కుల, మత, వర్గ, లింగ, వర్ణ విభేదాలు లేకుండా ప్రజలందరినీ గౌరవించవలెను. సోదరభావాన్ని, సౌభ్రాతృత్వాన్నీ పెంపొందించవలెను. స్త్రీలను గౌరవించవలెను.
  6. మన భారతదేశంలో గల మిశ్రమ సంస్కృతినీ, మిశ్రమ మరియు అద్భుత వారసత్వాన్ని కాపాడుకొన వలెను.
  7. ప్రకృతీ పరిసరాలైన అడవులను, సరస్సులను, నదులను మరియు వన్యప్రాణులను మరియు ఇతర జీవులను సంరక్షించుకొనవలెను.
  8. శాస్త్రీయ దృక్పథాన్ని, వైజ్ఞానిక విషయాలను పెంపొందించి జ్ఞానాభివృద్ధి కొరకు ఎల్లవేళలా పాటుపడవలెను.
  9. ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను కాపాడవలెను. హింసను విడనాడవలెను.
  10. భారతదేశం అభివృద్ధి చెందునట్లు, వ్యక్తిగతంగాను, సామాజికంగాను లేదా మిశ్రమంగానూ పాటుపడుతూ, దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ, దానిని సాధించుటకు కృషిచేయవలెను.
  2002 భారత రాజ్యాంగ 86వ సవరణ ప్రకారం 11వ విధి ఇవ్వబడినది. ఈ విధి, "తండ్రి గాని, సంరక్షకుడు గాని, తమ బిడ్డలకు 6-14 వయస్సు వరకు విద్యా బోధన చేపట్టాలి", అని బోధిస్తుంది.



No comments:

Post a Comment